నిర్మల్‌ డీఎల్‌ఎస్‌ఏకు కొత్త కార్యదర్శి

కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ (Nirmal DLSA) కార్యదర్శిగా సీనియర్ సివిల్ జడ్జి పి. రవీందర్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శిగా విధులు నిర్వహించిన రాధిక నుంచి ఆయన బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం పి. రవీందర్‌ను న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది శాలువా, పూలమాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్. శ్రీవాణి, న్యాయమూర్తులు నికిత, భవిష్య, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శుభకరన్‌, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>