అక్రమ తరలింపు.. 100 క్వింటాళ్ల PDS బియ్యం పట్టివేత

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) నగరంలోని మిర్చి కాంపౌండ్‌లో ఉన్న న్యూ పాపులర్ ట్రాన్స్‌పోర్ట్ నుండి సుమారు 400 బ్యాగులు దాదాపు 100 క్వింటాళ్ల ప్రభుత్వ PDS బియ్యాన్ని మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తుండగా ( PDS Rice Seized) పట్టుకున్నారు. టౌన్–I పోలీసు సిబ్బంది తనిఖీలు నిర్వహించి, ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థకు (PDS) చెందిన బియ్యాన్ని పట్టుకున్నారు. ఈ సందర్భంగా సుమారు 400 బ్యాగులు (100 క్వింటాళ్లు) PDS బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ట్రాన్స్పోర్ట్ యజమాని జానీ పాషాను అలాగే అబ్దుల్ లతీఫ్ లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ప్రభుత్వ పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేయడం, నిల్వ చేయడం, ఇతర రాష్ట్రాలకు తరలించడం లేదా విక్రయించడం చట్టవిరుద్ధమని హెచ్చరించారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టౌన్–I ఎస్ హెచ్‌వో తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>