కలం, ఖమ్మం బ్యూరో: కొత్తగూడెం (Kothagudem) పట్టణానికి చెందిన విఠల్ జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. శాంతియుత ఆర్థికాభివృద్ధి, ఆర్థిక అహింస దిశగా ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపు లభించింది. ‘ఎకనామిక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ (ECI) ఆయనను నేషనల్ కోఆర్డినేటర్‌గా నియమించింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌరవ్ అగర్వాల్ జారీ చేసిన నియామక ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి రానున్నాయి.
ఆర్థిక సోదరభావం, విధాన రూపకల్పన, ప్రభుత్వ-కార్పొరేట్ సంస్థల సమన్వయం ద్వారా దేశ ఆర్థిక పురోగతికి కట్టుబడి పనిచేస్తానని ఈ సందర్భంగా విఠల్ తెలిపారు. సంస్థ నిబంధనలకు లోబడి పూర్తి పారదర్శకతతో బాధ్యతలు నిర్వహిస్తానని పేర్కొన్నారు. విఠల్ నియామకంపై జిల్లాకు చెందిన పలు ప్రజా సంఘాలు, ఆర్థిక నిపుణులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

