పెండింగ్‌ భూ సమస్యలకు చెక్‌.. కలెక్టర్‌ ఆదేశం

కలం, నిర్మల్‌: నిర్మల్ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌(Nirmal Collector) భవేశ్‌ మిశ్రా (Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. మంగళవారం నిర్మల్‌ జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో భూభారతి, భూముల సర్వే, రీ సర్వే, నూతన స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ, సీఎంఆర్‌ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలపై తహసీల్దార్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా 22-ఏ కింద ఉన్న భూ వివాదాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని సూచించారు.

సర్వే, రీ సర్వే పకడ్బందీగా

భూముల సర్వే, రీ సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ముందుగా గ్రామసభలు నిర్వహించిన అనంతరమే రీ సర్వే ప్రక్రియను ప్రారంభించాలని స్పష్టం చేశారు. గ్రామసభలకు సంబంధించిన రికార్డులను పక్కాగా నమోదు చేయాలని సూచించారు. సర్వే పనులను వేగవంతం చేసేందుకు అదనంగా **ఐదు అధునాతన సర్వే యంత్రాలను** అందిస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. సర్వే వివరాలను ప్రతిరోజూ నమోదు చేస్తూ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ వేగవంతం చేయాలి

జిల్లాలో నూతన స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీని వేగవంతం చేయాలని కలెక్టర్‌ సూచించారు. రేషన్‌ డీలర్ల వారీగా అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

సీఎంఆర్‌పై ప్రత్యేక దృష్టి

సీఎంఆర్‌ ప్రక్రియను నిర్దేశిత గడువులో పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ధాన్యం, సీఎంఆర్‌కు సంబంధించిన ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. రైస్‌ మిల్లులను క్రమం తప్పకుండా తనిఖీ చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>