మక్తల్ లో విస్తృతంగా వాహనాల తనిఖీ

కలం, మక్తల్ : అజాగ్రత్తగా వాహనాలను నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవించి ప్రాణ నష్టం వాటిల్లుతున్నదని, వాహనదారులు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ తమ కుటుంబాల్లో కన్నీటిని మిగల్చవద్దని మక్తల్ సీఐ రామ్ లాల్, ఎస్సై రాజు యాదవ్ అన్నారు. మక్తల్ పట్టణంలోని 167 వ జాతీయ రహదారిపై మంగళవారం మక్తల్ (Makthal Police) సీఐ రాంలాల్, ఎస్ఐ రాజు యాదవ్ ఆధ్వర్యంలో విస్తృతంగా వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రత నియమాలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా వాహనాలను నడపవద్దన్నారు. అలాగే కార్లు, స్కూల్ బస్సులు, భారీ వాహనాలు నడిపే డ్రైవర్లు తగిన జాగ్రత్తలు పాటించాలని వారు సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>