జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యం: గెడల శ్రీనివాసరావు

కలం, కరీంనగర్ బ్యూరో: జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, లక్ష తమలపాకులతో అర్చనలు ఘనంగా నిర్వహించారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ (MLC) అభ్యర్థి డాక్టర్ గెడల శ్రీనివాసరావు (Gedela Srinivasa Rao) ఆధ్వర్యంలో మెగా యూత్ ఫోర్స్ రాష్ట్ర కన్వీనర్ కాసరాజు, పార్టీ నాయకులు, జనసైనికుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం డాక్టర్ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

కొండగట్టు అభివృద్ధిపై ఆవేదన..

పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు మరింత సేవ చేయాలని కొండగట్టు అంజన్నను వేడుకున్నట్లు శ్రీనివాసరావు  తెలిపారు. 2018లో పవన్ కళ్యాణ్ స్వామివారిని దర్శించుకుని రూ.11 లక్షల విరాళం అందించారని, ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత భక్తుల సౌకర్యార్థం టీటీడీ ద్వారా సుమారు ₹35.19 కోట్ల నిధులతో 96 గదుల నిర్మాణం, దీక్షా విరమణ మండపానికి శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. అయితే నిధులు మంజూరై 8 నెలలు గడుస్తున్నా పనుల్లో పురోగతి లేకపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మంత్రులు స్పందించాలి..

మంత్రులు పొన్నం ప్రభాకర్,  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు తక్షణమే స్పందించి రాజకీయాలకు అతీతంగా పనులను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై జనసేన నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. అధినేత ఆదేశాల మేరకు ఈ నెల 4వ తేదీన 22A సమస్యకు సంబంధించి హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద రాష్ట్ర స్థాయి నాయకుల భాగస్వామ్యంతో బృహత్తర ధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

“క్యాడర్ టు లీడర్” – స్థానిక సంస్థల్లో ప్రాధాన్యత

సామాన్య కార్యకర్తలను సైతం నాయకులుగా తీర్చిదిద్దే సంకల్పంతో “క్యాడర్ టు లీడర్” సిద్ధాంతంతో జనసేన ముందుకెళ్తోందని చెప్పారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ నాయకులకు తగిన ప్రాధాన్యత ఉంటుందన్నారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్థానానికి తనను అభ్యర్థిగా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఈ పోటీ కేవలం ఒక వ్యక్తిది కాదని, జనసేన పార్టీ పోటీగా భావించి పట్టభద్రుల గొంతుకను శాసనమండలిలో వినిపించేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొన్నదేవి పటేల్, ప్రతాని రామకృష్ణ గౌడ్, శ్రీదేవి, రామ్ యాదవ్, మిర్యాల రామకృష్ణ, సంపత్, డాక్టర్ రాజకిరణ్, బెక్కం జనార్ధన్, హాసన్ పర్తి నాయకులు, పార్టీ కార్యకర్తలు  పాల్గొన్నారు.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>