మున్నేరులో నీటి ఎద్దడి.. గణేశ్ నిమజ్జనానికి పరిశీలన!

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మంలో వినాయక నిమజ్జనానికి మున్నేరు నదిలో నీటి లభ్యత తక్కువగా ఉండటంతో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ (CP Sunil Dutt) ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించారు. నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు మంగళవారం ఆయన పోలీస్ అధికారులు, స్తంబాద్రి ఉత్సవ కమిటీ ప్రతినిధులతో కలిసి ఖమ్మం అర్బన్ మండలం దంసలాపురం పంచాయతీలోని కొత్తూరు చెరువును పరిశీలించారు.

​ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విగ్రహాల తరలింపు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, భద్రతపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రామానుజం, ఏసీపీలు రమణమూర్తి, మహేష్, ఇన్స్‌పెక్టర్లు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>