కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాల వేళ కొత్త వివాదం రాజుకుంటోంది. తాము అభివృద్ధి చేసిన చెరువుల్లో విగ్రహాల నిమజ్జనాలకు (Ganesh Immersion) అనుమతించబోమని హైడ్రా (HYDRAA) తేల్చి చెప్పింది. జీహెచ్ఎంసీ సూచించిన చెరువులు, జల వనరుల్లో మాత్రమే నిమజ్జనం చేసుకోవాలని చెబుతోంది. దీనిపై గణేశ్ ఉత్సవ సమితి అభ్యంతరం చెబుతోంది. నిమజ్జనాన్ని అడ్డుకునే అధికారం లేదని స్పష్టం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ గతంలో ఎలా అయితే చేశామో.. ఇప్పుడు కూడా నిమజ్జన ప్రక్రియ అలాగే ఉంటుందని చెబుతోంది.
హైడ్రా వాదన ఇది..
హైడ్రా (HYDRAA) ఏర్పాటైన తరువాత నగరంలోని బతుకమ్మ కుంట లాంటి కొన్ని చెరువులను గుర్తించి, వాటిని అభివృద్ధి చేసింది. కొన్నింటి పనులు ఇంకా జరుగుతున్నాయి. నిమజ్జనాలు చేయడం వలన అందులో వాడే ప్రమాదకరమైన రసాయనాలు, సామగ్రితో చెరువులు కలుషితం అయ్యే ప్రమాదం ఉందని వాదిస్తోంది. నీటి నాణ్యత కూడా దెబ్బతింటుందని, జరుగుతున్న పనులకు కూడా ఆటంకం కలుగుతుందని పేర్కొంటుంది. మరోవైపు, గణేశ్ ఉత్సవ సమితి కూడా తగ్గకపోవడం లేదు. భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉన్న పండుగను ఒక సంస్థ నిర్దేశించలేదని స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో మున్ముందు ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందా.. అనే చర్చ జరుగుతోంది.
Also Read : కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ భేటీ.. కేబినెట్ మార్పుపై కీలక చర్చ..!
Follow Us On: X(Twitter)

