కలం, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో జరుగుతున్న 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో పాకిస్తాన్ వరసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయింది. బాబర్ అజామ్ కెప్టెన్సీలోని జట్టు దారుణంగా విఫలమైంది. దాంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కఠిన నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 9న మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ లోపే పీసీబీ ఏకంగా 7 మంది ప్లేయర్లను జట్టు నుంచి తీసేసింది. వీరితో పాటు హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్‌లపై కూడా వేటు వేసింది. కొత్తగా ఎంపిక చేసిన 7 మంది ఆటగాళ్లకు బ్రిటన్ వీసాలు ఇంకా రాలేదు. కానీ పాత ప్లేయర్ల తొలగింపును బోర్డు ముందే ప్రకటించేసింది. ఈ నిర్ణయంపై మాజీ ఛైర్మన్ రమీజ్ రాజా (Ramiz Raja) తీవ్రంగా మండిపడ్డారు.
సిరీస్ మధ్యలో ఇన్ని తొలగింపులు చేసి పీసీబీ ‘వరల్డ్ రికార్డ్’ సృష్టించిందని రమీజ్ రాజా (Ramiz Raja) ఎద్దేవా చేశారు. పీసీబీ భయంతోనే ఈ పనిచేసిందని విమర్శించారు. ఫుట్‌బాల్ లీగ్ మధ్యలో మేనేజర్‌ను తీసేసినట్లుగా ఉందన్నారు. మరో 10 రోజులు ఆగితే సిరీస్ పూర్తయ్యేదని చెప్పారు. ఈ నిర్ణయం జట్టును స్వార్థపూరితంగా మారుస్తుందన్నారు. మాజీ దిగ్గజాలైన సర్ఫరాజ్, ఉమర్ గుల్‌లను గౌరవించకపోతే భవిష్యత్తులో ఎవరూ కోచ్‌లుగా రారన్నారు. రాబోయే రోజుల్లో పాక్ క్రికెట్‌కు మరిన్ని కష్టాలు తప్పవని హెచ్చరించారు. ఈ అకస్మాత్తు మార్పులతో కొత్త ఆటగాళ్లు రాణించి జట్టు గెలుస్తుందనే నమ్మకం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. పీసీబీ వైఖరిపై తీవ్ర చర్చ నడుస్తోంది.
Also Read : హైడ్రా అభ్యంతరం.. గణేశ్ నిమజ్జనాలపై కొత్త వివాదం
Follow Us On : WhatsApp

