కలం, వెబ్ డెస్క్: కొండా సురేఖ (Konda Surekha) ఎపిసోడ్ క్లైమాక్స్‌కు చేరుతుండటంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తాజాగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, వివేక్, స్పీకర్ గడ్డం ప్రసాద్, ఇతర కీలక నేతలు ఢిల్లీకి పయనమయ్యారు. హైకమాండ్ పెద్దలతో భేటీ అయ్యేందుకు నేతలు వరుసగా హస్తినకు చేరుకుంటున్నారు. కొండా సురేఖ కేసీ వేణుగోపాల్‌తో సమావేశం కానుండగా, ఆ తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఆయనను కలిసే అవకాశం ఉంది. ఈ భేటీకి కూడా ప్రాధాన్యం ఏర్పడింది.
ఈ నేపథ్యంలో కేబినెట్‌లో మార్పులు ఉంటాయా, కొందరికి ఉద్వాసన తప్పదా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ కీలక పరిణామాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుది నిర్ణయం తీసునే అవకాశం కూడా ఉంది. అధిష్టానంతో సీఎం జరుపనున్న చర్చల అనంతరం రాష్ట్ర మంత్రివర్గ ప్రక్షాళన, వివాదాల పరిష్కారంపై స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

