విద్యార్థులపై కేసులు.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు

కలం, వెబ్ డెస్క్: ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనల్లో భాగంగా విద్యార్థులపై నమోదైన కేసులను కొట్టేస్తూ సుప్రీం కోర్టు (Supreme Court)  సంచలన తీర్పు వెలువరించింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఆందోళనకారులపై అన్ని రకాల ఎఫ్ఐఆర్‌లు రద్దు చేసింది. జులై 20 నుంచి 25వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన చేసిన ప్రాంతాల్లో నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అంతేగాకుండా నిరసనల్లో భాగంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు మూడు నెలల్లో నష్ట పరిహారం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఇందుకు సంబంధించి విధి విధానాలను తయారు చేయాలని ఉత్తర్వులిచ్చింది.

వారిపై కేసులు కొనసాగేలా..

సుప్రీం కోర్టులో విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కీలక విషయాలు పేర్కొంది. విద్యార్థుల ఆందోళనల ముసుగులో కొందరు అరాచక శక్తులు అల్లర్లకు యత్నించారని వివరించింది. అలాంటి వారిని ఇప్పటివరకు 2,873 మందిని గుర్తించామని.. వీరిపై విచారణ మాత్రం కొనసాగిస్తామని ధర్మాసనానికి తెలిపింది. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడంతో పాటు ఇతర క్రిమినల్ కేసులు కూడా నమోదైనట్లు స్పష్టం చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>