అనారోగ్య బాధితుడికి శ్రీహరిరావు చేయూత

కలం, నిర్మల్‌: మామడ మండలం పొన్కల్‌ గ్రామానికి చెందిన నర్సయ్య అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెరుగైన వైద్యం కోసం ఆర్థిక సహాయం అవసరం కావడంతో ఆయన కుటుంబ సభ్యులు కాంగ్రెస్‌ పార్టీ నిర్మల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరిరావును (Kuchadi Srihari Rao) సంప్రదించారు. విషయం తెలుసుకున్న శ్రీహరిరావు స్పందించి ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించారు. మంగళవారం నర్సయ్య కుటుంబ సభ్యులకు ఆ ఎల్‌ఓసీ చెక్కును అందజేశారు.

ఈ సందర్భంగా శ్రీహరిరావు మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు అనారోగ్య సమయంలో ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అర్హులైన వారికి అవసరమైన ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ లింగన్న, అనంతపేట్‌ సర్పంచ్‌ తిరుమల్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>