ఏపీలో పేదల ఇళ్ల నిర్మాణానికి కూటమి సర్కార్ గ్రీన్ సిగ్నల్

కలం, వెబ్ డెస్క్ : ఏపీలో ఇళ్లులేని పేదలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్ణణ పథకం 2.0 (PMAY Urban) కింద పట్టణాల్లో ఇళ్ల నిర్మాణానికి కూటమి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 17,912 ఇళ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసింది. దీనికోసం రూ. 447.80 కోట్లను విడుదల చేసింది.

ఈ గృహ నిర్మాణ పథకం (PMAY Urban) కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా లబ్దిదారుడికి రూ. 2.50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తాయి. దీనిలో కేంద్రం వాటా రూ. 1.50 లక్షలు కాగా.. రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ. 1 లక్ష. దీనికి అదనంగా వీబీ జీరామ్‌జీ కింద రూ.27 వేలు, స్వచ్ఛ భారత్ మిషన్ కింద మరుగుదొడ్డి మరో 12,000 వస్తాయి. అన్నింటినీ కలుపుకొని లబ్ధిదారుడికి మొత్తం రూ. 2.89 లక్షల ఆర్థిక సాయం అందనుంది. మంజూరైన ఇళ్లలో 15,793 ఇళ్లు పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఉండగా.. మరో 2,119 ఇళ్లు పట్ణణాభివృద్ధి సంస్థ పరిధిలో నిర్మించనున్నారు. ఒక్కో ఇంటి కార్పెట్ ఏరియా 30 నుంచి 45 చదరపు మీటర్ల వైశాల్యంలో ఉండాలని స్పష్టం చేస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. నిర్మాణ పనులకు సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లు అధికారిక అనుమతులు ఇస్తారు.

Also Read : జీతాలకు సై.. బాధ్యతలకు నై!

Also Read : యూఎస్‌లో తెలుగు వారి కథ: షాకింగ్ వీడియో వైరల్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>