కలం, వనపర్తి: కొల్లాపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి (Bheeram Harshavardhan Reddy) జన్మదినాన్ని పురస్కరించుకుని పానుగల్ మండలంలో యువ శక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఫౌండేషన్ నాయకుడు సోమిశెట్టి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని జ్యోతి నందన్ రెడ్డి హాజరై ప్రారంభించారు. బీఆర్ఎస్ నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయగా.. మొత్తం 105 యూనిట్ల రక్తాన్ని సేకరించి ప్రభుత్వ ఆసుపత్రికి పంపించినట్లు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కాగితాల మధు తెలిపారు.
సోమిశెట్టి కిషోర్ కుమార్ మాట్లాడుతూ.. రక్తదానం ప్రాణదానంతో సమానం. ఒక వ్యక్తి ఇచ్చే రక్తం పలువురి ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగపడుతుందన్నారు. రక్తదాన కార్యక్రమం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు వీరసాగర్, మాజీ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ చంద్రశేఖర్, జ్యోతి నందన్ రెడ్డి, సోమిశెట్టి కిషోర్ కుమార్, యువశక్తి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కాగితాల మధు, న్యాయవాది రవికుమార్, బాలవర్ధన్ రెడ్డి, రాజవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.

