కరీంనగర్‌లో ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు

కలం, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ఏఐటీయూసీ (AITUC) 4వ మహాసభలు సెప్టెంబర్ 6 నుంచి 8వ తేదీ వరకు కరీంనగర్ నగరంలో నిర్వహించనున్నట్లు సిపిఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి తెలిపారు. మహాసభల ఏర్పాట్లలో భాగంగా పద్మనాయక కల్యాణ మండపాన్ని సిపిఐ, ఏఐటీయూసీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా కరీంనగర్‌లో ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి ఏఐటీయూసీ అనుబంధ కార్మిక సంఘాలకు చెందిన సుమారు 700 మంది ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరుకానున్నారని చెప్పారు.

మూడు రోజుల పాటు హాజరయ్యే ప్రతినిధులకు వసతి సౌకర్యాలు కల్పించడంతో పాటు పద్మనాయక కల్యాణ మండపంలో మహాసభల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు. సెప్టెంబర్ 6న కరీంనగర్ సర్కస్ గ్రౌండ్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మహాసభలను విజయవంతం చేసేందుకు కార్మిక లోకం పెద్ద సంఖ్యలో కరీంనగర్‌కు తరలిరావాలని చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, న్యాలపట్ల రాజు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, నాయకులు నునావత్ శ్రీనివాస్, సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>