కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ చంచల్‌గూడ జైలు (Chanchalguda Jail)లో ఖైదీ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన కంది సాగర్ అనే వ్యక్తి ఓ కేసులో అరెస్ట్ కాగా, పోలీసులు ఇటీవలే చంచల్‌గూడ జైలుకి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే సోమవారం జైలు ప్రాంగణంలోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. తోటి ఖైదీలు వెంటనే జైలు అధికారులకు సమాచారం అందించారు. వైద్య సిబ్బంది వచ్చి చూసేసరికి అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై జైల్ సూపరింటెండెంట్ విచారణకు ఆదేశించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సాగర్ కుటుంబ సభ్యులకు జైలు సిబ్బంది సమాచారం అందించారు.

