నేపాల్ వ‌ర‌ద‌లు.. రూ.50 కోట్ల విలువైన బంగారం వెలికితీత‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: ఇటీవ‌ల నేపాల్‌లో సంభ‌వించిన ఆక‌స్మిక వ‌ర‌ద‌ల‌కు (Nepal Floods) భారీగా ప్రాణ‌, ఆస్తి న‌ష్టం సంభ‌వించింది. ఇప్ప‌టికే మృతుల సంఖ్య 900 దాటేసింది. మ‌రోవైపు 3000కు పైగా ప్ర‌జ‌లు వ‌ర‌ద‌లో గ‌ల్లంత‌య్యారు. ఈ వ‌ర‌ద‌ల్లో త్రిశూలీ ప్రాంతంలోని అగ్రిక‌ల్చ‌ర‌ల్ డెవెల‌ప్ మెంట్ బ్యాంక్‌లోకి భారీగా నీరు వ‌చ్చి చేరింది. దీంతో నీరు, బుర‌ద మొత్తం బ్యాంకును ముంచేశాయి. నాలుగు రోజులుగా ఆ ప్రాంతంలో స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. రెస్క్యూ బృందాలు నేడు భారీ ఎత్తున బంగారాన్ని గుర్తించాయి.

వ‌ర‌ద‌తో నిండిపోయిన అగ్రిక‌ల్చ‌ర‌ల్ బ్యాంకులోకి నేడు రెస్క్యూ బృందాలు ప్ర‌వేశించాయి. అధికారులు చేప‌ట్టిన స‌హాయ‌క చ‌ర్య‌ల్లో సుమారు రూ.50 కోట్ల విలువైన బంగారాన్ని సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీసుకొచ్చారు. అలాగే వెండి, న‌గ‌దును కూడా వెలికితీశారు. వీటి కోసం సుమారు 8 గంట‌ల పాటు అధికారులు క‌ష్ట‌ప‌డ్డారు. లాక‌ర్ల‌లో భ‌ద్ర‌ప‌ర్చిన బంగారం, వెండి, కీల‌క ప‌త్రాల‌ను అక్క‌డి నుంచి త‌ర‌లించారు. నేపాల్‌లో స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. భార‌త్‌, చైనా, ద‌క్షిణ కొరియా దేశాల బృందాలు సైతం నేపాల్ సైన్యంతో క‌లిసి ర‌క్ష‌ణ చ‌ర్య‌ల్లో పాల్గొంటున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>