నల్లమాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు స్పాట్ డెడ్!

కలం, వెబ్ డెస్క్: శ్రీ సత్యసాయి (Sri Sathya Sai) జిల్లా నల్లమాడ (Nallamada) మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అరవవాండ్లపల్లి వద్ద అతివేగంగా వెళ్తున్న ఓ బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న అనిల్, దీక్షిత్, అర్జున్ అనే ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు.

ప్రమాదం జరిగిన వెంటనే బైక్ లో మంటలు చెలరేగడంతో అది పూర్తిగా కాలిపోయింది. స్థానికులు సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>