కలం, సినిమా: బీఆర్ఎస్ నేత జోగినపల్లి సంతోష్ పర్యావరణ పరిరక్షణ కోసం సీడ్ గణేశ్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సీడ్ గణేశ్ క్యాంపెయిన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. గ్రీణ్ గణేశ్ లాంచ్ చేయడం సంతోషంగా ఉందన్నారు. మట్టి, సహజ పదార్థాలు, విత్తనాలతో తయారు చేసిన ఈ విగ్రహాన్ని పూజ తర్వాత ఇంట్లోనే నిమజ్జనం చేయవచ్చని తెలిపారు.
గతంలో చిరంజీవి గ్రీన్ చాలెంజ్‌లో కూడా పాల్గొన్నారు. దీంతో జోగినపల్లి చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. చిరంజీవి మాటలు ఎంతోమందిని పర్యావరణ హితమైన వేడుకలను ఎంచుకునేలా సూచిస్తాయని జోగినపల్లి అన్నారు.

