గ్రీన్ గణేశ్‌ని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం: చిరంజీవి

కలం, సినిమా: బీఆర్ఎస్ నేత జోగినపల్లి సంతోష్ పర్యావరణ పరిరక్షణ కోసం సీడ్ గణేశ్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సీడ్ గణేశ్ క్యాంపెయిన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. గ్రీణ్ గణేశ్‌ లాంచ్ చేయడం సంతోషంగా ఉందన్నారు. మట్టి, సహజ పదార్థాలు, విత్తనాలతో తయారు చేసిన ఈ విగ్రహాన్ని పూజ తర్వాత ఇంట్లోనే నిమజ్జనం చేయవచ్చని తెలిపారు.

గతంలో చిరంజీవి గ్రీన్ చాలెంజ్‌లో కూడా పాల్గొన్నారు. దీంతో జోగినపల్లి చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. చిరంజీవి మాటలు ఎంతోమందిని పర్యావరణ హితమైన వేడుకలను ఎంచుకునేలా సూచిస్తాయని జోగినపల్లి అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>