శివన్న గూడెం ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలి : భాస్కర్

కలం, మునుగోడు : సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న శివన్న గూడెం ప్రాజెక్టు పనులను ప్రభుత్వం వెంటనే పూర్తి చేయడంతో పాటు, రాచకొండ ఎత్తిపోతల పథకాన్ని తక్షణమే మంజూరు ఇచ్చేలా రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో గల మెత్తాలని ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) ను ఈ‌ఎల్‌వి ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ కోరారు. హరీష్ రావును ఆదివారం హైదరాబాదులో ప్రాజెక్టు సమస్యలపై స్వయంగా కలిసి వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శివన్న గూడెం ప్రాజెక్టు పూర్తయితే ఆయా కట్టు రైతులకు సాగునీటి ప్రయోజనం కలగడంతోపాటు, రాచకొండ ఎత్తిపోతల పథకానికి మంజూరు లభిస్తే ఈ ప్రాంతంలోని సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఈ రెండు అంశాలను అసెంబ్లీ సమావేశాల్లో గలిమెత్తి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి, త్వరితగతిన చర్యలు చేపట్టేలా కృషి చేయాలని హరీష్ రావును కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>