మొహమ్మద్ ఆమిర్ కీలక ప్రకటన.. పాక్ జట్టులోకి రీఎంట్రీకి నో ఛాన్స్!

కలం, స్పోర్ట్స్: పాకిస్థాన్ మాజీ పేసర్ మొహమ్మద్ ఆమిర్ (Mohammad Amir) కీలక ప్రకటన చేశాడు. పాకిస్థాన్ జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశాడు. తన పాకిస్థాన్ అధ్యాయం ముగిసిపోయిందని తెలిపాడు. ఆమిర్‌కు ఇటీవల బ్రిటిష్ పౌరసత్వం లభించింది. దీంతో ఇంగ్లాండ్‌లోని కౌంటీ క్రికెట్, ది హండ్రెడ్ వంటి టోర్నీల్లో అతడు లోకల్ ప్లేయర్‌గా ఆడుతున్నాడు. లోకల్ ప్లేయర్‌గా ఆడేందుకు ఒక నిబంధనపై సంతకం చేయాల్సి ఉంటుందని ఆమిర్ వివరించాడు. మరో దేశానికి లోకల్ ప్లేయర్‌గా ప్రాతినిధ్యం వహించకూడదన్న నిబంధన అందులో ఉంటుందని చెప్పాడు. అందుకే పాకిస్థాన్ తరఫున తిరిగి ఆడే అవకాశం లేదని స్పష్టం చేశాడు. ఆమిర్ 2024లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. పాకిస్థాన్ తరఫున 36 టెస్టులు, 61 వన్డేలు, 62 టీ20లు ఆడాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో దేశవాళీ, ఫ్రాంచైజీ క్రికెట్‌పైనే ఆమిర్ దృష్టి పెట్టాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>