సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఏలేటి

కలం, నిర్మల్ : ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఖరీదైన వైద్యచికిత్స చేసుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆసరాగా నిలుస్తుందని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (MLA Alleti Maheshwar Reddy) అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు ఆదివారం సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు.

నిర్మల్ టౌన్, నిర్మల్ రూరల్, సోన్, దిలవార్ పూర్, నర్సాపూర్ (జి), లక్ష్మణచందా, మామడ మండలాలకు చెందిన 226 మంది లబ్ధిదారులకు రూ. 56.43 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల, పట్టణ బీజేపీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.

Also Read : తెలంగాణలో 1000 రోజుల పాలనపై మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>