గిన్నిస్ వరల్డ్ రికార్డులోకి ఇన్‌స్పెక్టర్ మహేశ్

కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమికలాన్ గ్రామానికి చెందిన ఇన్‌స్పెక్టర్ మహేశ్ (Inspector Mahesh) గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించారు. లడక్‌లో 2,100 కిలోమీటర్లు ప్రయాణించి ప్రపంచంలోనే ఎత్తయిన రహదారి ఉమ్లింగ్ పాస్‌ను విజయవంతంగా దాటారు. అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో ఏడు రోజుల పాటు సాహస యాత్ర పూర్తి చేసినందుకు గిన్నిస్ రికార్డులో పేరు నమోదైంది.

ఈ నేపథ్యంలో కామారెడ్డి పట్టణంలోని వశిష్ట కాలేజీలో అభినందన సభ నిర్వహించారు. దేమికలాన్ గ్రామస్థులు, మహేశ్ చిన్ననాటి మిత్రులు, క్లాస్ మేట్స్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేసి అభినందనలు తెలిపారు. తాడ్వాయి మాజీ ఎంపీపీ రాజు, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొంగల వెంకట్, వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>