పలాస వద్ద ప్రమాదం.. టీచర్ల క్యాబ్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు!

కలం, వెబ్ డెస్క్ : విశాఖలో డీఎస్సీ ‌‌- 2025 ఉపాధ్యాయులు భారీ ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించనున్న వేళ ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. మెగా డీఎస్సీపై వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఖండించేందుకు నిర్వహిస్తున్న ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తున్న టీచర్ల క్యాబ్ ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. శ్రీకాకుళం జిల్లా నుంచి విశాఖ వెళ్లే మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. పలాస (Palasa Accident) మండలం గరుడఖండి వద్ద టీచర్లతో వెళ్తున్న క్యాబ్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొంది.

ఈ ప్రమాదంలో ఐదుగురు ఉపాధ్యాయులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రలను పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాద సమయంలో క్యాబ్‌లో ఆరుగురు ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>