సుంక్లిలో అన్నా భావు సాఠే విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే పవార్ రామారావు

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా భైంసా మండలం సుంక్లి గ్రామంలో సాహిత్య సామ్రాట్ అన్నా భావు సాఠే (Anna Bhau Sathe) జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని (Statue) ముధోల్ ఎమ్మెల్యే (Mudhole MLA) పవార్ రామారావు పటేల్ (Pavar Rama Rao Patel) ఆదివారం ఆవిష్కరించారు.

అనంతరం నిర్వహించిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అన్నా భావు సాఠే తన రచనలు, కవితల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని కొనియాడారు. సామాజిక అసమానతలపై పోరాటానికి ఆయన రచనలు స్ఫూర్తినిచ్చాయని, అణగారిన వర్గాల హక్కుల సాధనకు చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.

సుంక్లి గ్రామ అభివృద్ధికి ఇప్పటికే సుమారు రూ. 80 లక్షల నిధులు కేటాయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. బిజ్జూర్‌ నుంచి పెంచికల్‌పాడ్‌ మీదుగా సుంక్లి వరకు బీటీ రోడ్డు, వంతెన నిర్మాణ పనులను త్వరలో ప్రారంభిస్తామని, వానల్‌పాడ్‌ నుంచి వంజర్‌ వరకు డబుల్‌ రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో దశలవారీగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతులు కల్పించి సుంక్లిని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>