ఎమ్మెల్యే బొజ్జు చొరవతో రూ. 7.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా పెంబి మండలం మండపల్లి గ్రామానికి చెందిన మర్రి అశన్న అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌ లోని నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించడంతో కుటుంబసభ్యులు ఆర్థిక సాయం కోసం ఖానాపూర్ ఎమ్మెల్యే (Khanapur MLA) వెడ్మ బొజ్జు పటేల్‌ (Vedma Bojju Patel) ను ఆశ్రయించారు.

వెంటనే స్పందించి సీఎం సహాయనిధి నుంచి రూ. 7.50 లక్షల ఎల్‌ఓసీని మంజూరు చేయించారు. ఆదివారం ఎల్‌ఓసీ చెక్కును బాధిత కుటుంబసభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. నిరుపేదలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>