మక్తల్‌ అభివృద్ధిపై మంత్రి వాకిటి ఫోకస్.. రూ. 2 వేల కోట్ల నిధులతో పనుల జోరు!

కలం, మక్తల్: గత 34 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మక్తల్ (Makthal) నియోజకవర్గ అభివృద్ధికి దాదాపు రూ.2000 కోట్ల నిధులు సాధించి, పనులను వేగంగా కొనసాగిస్తున్నామని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి (Minister Vakiti Srihari) పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు తీసుకువచ్చి నియోజకవర్గంలోని గ్రామాలు అన్నింటినీ అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.

మక్తల్ మండలంలోని జవలాపూర్ సర్పంచ్ మహాదేవమ్మ బాలకిష్టయ్యతో పాటు ఉప సర్పంచ్ చిన్న హనుమంతు, పలువురు వార్డు సభ్యులు మంత్రి సమక్షంలో ఆదివారం బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి మంత్రి కాంగ్రెస్ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలకతీతంగా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి అన్నారు.

నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీల సర్పంచులు, నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి రావడం శుభ పరిణామం అన్నారు. అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో దాదాపు 5వేలకు పైగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని ఆయన అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>