మధ్యప్రదేశ్‌‌లో దారుణం.. హారన్ కొట్టాడని చంపేశారు!

కలం, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) ఉజ్జయినిలో ట్రాక్టర్ ఏజెన్సీ యజమాని యశ్ మిట్టల్ (27) హత్య స్థానికంగా సంచలనం సృష్టించింది. కారులో వెళ్తున్న యశ్.. రోడ్డుపై అడ్డుగా నిలబడిన యువకులకు హారన్ కొట్టారన్న చిన్న సాకుతో వివాదం మొదలైంది. ఈ చిన్న విషయం ఘర్షణకు దారితీసింది. మాటామాటా పెరగడంతో ఆగ్రహం చెందిన నలుగురు నిందితులు విచక్షణా రహితంగా కత్తులతో దాడి చేసి యశ్‌ను దారుణంగా హతమార్చారు. ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఈ దారుణ సీరియస్‌గా పరిగణించిన పోలీసులు వెంటనే స్పందించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితులకు సంకెళ్లు వేసి, రోడ్డుపై బహిరంగంగా నడిపిస్తూ ప్లాస్టిక్ పైపులతో దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>