కలం, యాదగిరిగుట్ట: యాదాద్రి ఆలయం (Yadadri Temple)లో శనివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. పంచనారసింహుల పుణ్యక్షేత్రంలో స్వామి వారికి నిత్య పూజలు, ఆరాధనలు కొనసాగాయి. శ్రావణ మాసం శనివారం సందర్భంగా ఉదయం నుంచే యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనానికి భక్తుల తాకిడి పెరిగింది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట, ఉచిత దర్శనానికి రెండు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. భారీగా భక్తులు తరలిరావడంతో గుట్టపై కోలాహలం నెలకొంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు, సిబ్బంది పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

