బీజేపీ కీలక సమావేశం.. ఎమ్మెల్యే ఏలేటి హాజరు

కలం, నిర్మల్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy)  కూడా హాజరయ్యారు. రాష్ట్రంలో పార్టీ రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఎమ్మెల్యే ఏలేటి కూడా తన సూచనలు అందించారు.

ఈ సమావేశంలో రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధానం, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సమాలోచనలు జరిపారు. పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మరింత చేరువయ్యేలా భవిష్యత్ కార్యాచరణ రూపొందించడంపై సమావేశంలో చర్చించినట్లు ఎమ్మెల్యే ఏలేటి తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>