మహారాష్ట్ర ఆలయాల సందర్శనలో ముధోల్ ఎమ్మెల్యే

కలం, నిర్మల్: ముధోల్ ఎమ్మెల్యే (Mudhol MLA) పవార్ రామారావు పటేల్ శనివారం మహారాష్ట్రలో ఆలయాలను సందర్శించారు. మొదట ఛత్రపతి శంభాజీనగర్‌‌లో పర్యటించి, అక్కడ ప్రసిద్ధ భద్ర హనుమాన్ స్వామి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం బుల్దానాలో చక్రధర్ స్వామి ఆలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా స్వామివారికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్‌కు సాదర స్వాగతం పలికి.. ఆలయ విశిష్టత వివరించారు. అనంతరం తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వచనాలు తెలిపారు. ఈ సందర్భంగా బుల్దానాలో ఆశ్రమాన్ని సందర్శించారు. ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆస్వాదించి, నిర్వాహకులతో కొద్దిసేపు మాట్లాడి.. భోజనం చేశారు. ఎమ్మెల్యే వెంట పలువురు బీజేపీ నాయకులు ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>