విజయసాయి రెడ్డి సంచలన లేఖ: జగన్, సజ్జలపై కీలక ఆరోపణలు

కలం, వెబ్ డెస్క్ : వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijaysai Reddy) రాసిన బహిరంగ లేఖ ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. తాను జగన్‌కు వీర విధేయుడిగానే పనిచేశానని.. కానీ చుట్టూ ఉన్న కోటరీనే తనను బలవంతంగా బయటకు పంపించిందని విజయసాయిరెడ్డి తన లేఖలో ఆరోపించారు. పైగా తనపై వైసీపీ ‘కోటరీ’ నమ్మకద్రోహి అంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

అందుకే A2 చేశారు..

తాను నమ్మకద్రోహినే అయితే సజ్జలలా కాంగ్రెస్‌తో సంధి చేసుకుని సీబీఐ, ఈడీ చార్జ్ షీట్‌లో తన పేరు లేకుండా చేసుకునేవాడినని విజయసాయిరెడ్డి (Vijaysai Reddy) ఎద్దేవా చేశారు. జగన్‌కు నమ్మకస్తుడిననే కారణంతోనే జగన్ తో పాటు ప్రతి ఛార్జ్ షీట్ లో తనను A2గా కాంగ్రెస్ ప్రభుత్వం చేర్చిందని ఆరోపించారు. 2022లో జరిగిన వైసీపీ ప్లీనరీ సమావేశాల సమయంలో సజ్జల తనపై భౌతికంగా దాడి చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై జగన్‌కు తెలిసినప్పటికీ ఆయన ఏం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అందరూ జగన్‌కు దూరం.. కారణం ఇదే!

జగన్‌కు తనతో పాటు కుటుంబ సభ్యులు దూరమైంది సజ్జల వల్ల కదా? అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. వైసీపీలో ఇప్పటివరకు తాను 74 అవమానాలను ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. తన ఆత్మగౌరవాన్ని చంపుకుని పార్టీలో పనిచేయలేక రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానని స్పష్టం చేశారు. ‘కోటరీ’ వల్ల అవమానాలు భరించలేకే పార్టీ నుంచి బయటకు వచ్చానని వ్యాఖ్యానించారు.

Also Read : మద్యం మత్తులో మహిళపై దారుణం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>