మూసారంబాగ్‌ కొత్త వంతెన ప్రారంభానికి రెడీ!

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో మూసీ నదిపై నిర్మించిన మూసారంబాగ్ కొత్త వంతెన (Musarambagh Bridge) ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఏటా వర్షాకాలంలో పాత వంతెన కారణంగా వాహనదారులు నరకం చూస్తున్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తినప్పుడు ఆ వరద పోటెత్తి కొన్ని సార్లు వంతెన దాదాపుగా మూతపడుతోంది. ఈ నేపథ్యంలోనే రూ.52 కోట్లతో కొత్త వంతెన నిర్మాణానికి గతంలోనే శ్రీకారం చుట్టగా.. ఇటీవలే నిర్మాణం పూర్తయింది. త్వరలోనే దీన్ని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ వంతెనను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.

400 మీటర్ల పొడవుతో..

మూసీ నదిపై 400 మీటర్ల పొడవుతో కొత్త వంతెన నిర్మాణమైందని కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. పాదచారులు వెళ్లేందుకు వీలుగా అటు ఇటు ఫుట్‌పాత్‌లు కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రోడ్ అప్రోచ్, లైటింగ్ సౌకర్యాల కల్పన కూడా వేగంగా పూర్తి చేయాలని ఇంజినీర్లను ఆదేశించారు. కొత్త వంతెన (Musarambagh Bridge) అందుబాటులోకి వస్తే.. అంబర్‌పేట్, మూసారంబాగ్ మధ్య ట్రాఫిక్ రద్దీ బాగా తగ్గుతుందన్నారు. మూసీ వరదల నుంచి ప్రయాణికులకు ఇక ఎలాంటి ఇబ్బంది ఉండబోదని స్పష్టం చేశారు.

Also Read : పాలమూరుకు ‘బ్రహ్మాస్త్రం’.. రూ 500 కోట్లతో 416 ఎకరాల్లో ఏర్పాటు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>