స్మార్ట్ రేషన్ కార్డులపై పోచారం కీలక వ్యాఖ్యలు

కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి జిల్లా బాన్సువాడ గ్రామీణ మండలం పోచారంలో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల (Smart Ration Cards) పంపిణీ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి (Pocharam Srinivas Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు తన చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం లబ్ధిదారులతో పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రేషన్ పంపిణీలో మరింత పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆకాంక్షించారు.

ఓటు హక్కు కోల్పోకుండా చూడాలి

అనంతరం సర్ నోటీసులపై అధికారులను పోచారం శ్రీనివాసరెడ్డి (Pocharam Srinivas Reddy) వివరాలు అడిగి తెలుసుకున్నారు. అర్హత ఉన్న ఒక్కరి ఓటు హక్కు కూడా కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. అర్హులైన ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని అధికారులకు సూచించారు. అర్హత ఉన్న వ్యక్తుల ఓటు హక్కు తొలగిపోకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఆర్డీఓ రవీందర్ రెడ్డి, బాన్సువాడ గ్రామీణ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Also Read : కాంగ్రెస్‌కు కడియం శ్రీహరి షాక్.. సంచలన డిమాండ్..!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>