కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ (Priyanka Gandhi), వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా కుమారుడు రైహాన్ వాద్రా, అవివా బేగ్‌తో (Aviva Baig) నిశ్చితార్థం చేసుకున్నారని ఢిల్లీ వర్గాలు ధృవీకరించాయి. ఈ జంట ఏడు సంవత్సరాలుగా రిలేషన్‌లో ఉంది. అవివా బేగ్ కుటుంబం ఢిల్లీలో ఉంది. గత కొంతకాలంగా రెండు కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. అవివా మూడు రోజుల క్రితం తన ఇన్‌స్టాగ్రామ్‌లో రైహాన్‌తో ఓ ఫొటోను అప్‌లోడ్ చేసింది. లవ్ సింబల్స్‌తో అదిరిపొయే క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ప్రియాంక గాంధీ మెచ్చిన అవివా బేగ్ (Aviva Baig) ఎవరంటూ నెటిజన్స్ తెగ ఆసక్తి చూపుతున్నారు. ఆమె ఎవరు? బ్యాగ్రౌండ్ ఎంటీ? అనే విషయాల గురించి తెలుసుకుంటున్నారు. ఢిల్లీలోని మోడరన్ స్కూల్‌లో హ్యుమానిటీస్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. OP జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో జర్నలిజం చేసింది. అవివా బేగ్ అటెలియర్ 11 అనే ఫోటోగ్రాఫిక్ స్టూడియో సహ వ్యవస్థాపకురాలు. దేశవ్యాప్తంగా అనేక స్టూడియోలను ఏర్పాటుచేసింది. ఈమెకు ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే స్టూడియోలను రన్ చేస్తోంది. అలాగే ఆమెకు రైటింగ్‌పై మంచి పట్టుంది. ‘యు కాంట్ మిస్ దిస్’ విత్ మెథడ్ గ్యాలరీ (2023), ఇండియా ఆర్ట్ ఫెయిర్ యంగ్ కలెక్టర్ ప్రోగ్రామ్ (2023)లో భాగంగా ‘యు కాంట్ మిస్ దిస్’, ది ఇల్యూసరీ వరల్డ్ ఎట్ ది కోరమ్ క్లబ్ (2019) ఇండియా డిజైన్ ఐడి, కె2 ఇండియా (2018)లో తన రచనలను ప్రదర్శించింది.
అవివా మీడియా (Media), పలు కమ్యూనికేషన్ రంగాల్లో పనిచేసింది. ప్రొపాగండలో జూనియర్ ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేశారు. పలు ప్రతిష్టాత్మకమైన ఇంటర్న్‌షిప్‌లను కూడా పూర్తి చేసింది. కామన్ హాబీ అయిన ఫొటోగ్రఫీ రైహాన్, అవివా బేగ్‌ను (Aviva Baig) కలిపింది.
Read Also: ఫారెస్ట్ లో రాహుల్ ఫ్యామిలీ న్యూ ఇయర్ వేడుకలు
Follow Us On: Instagram


