14 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. నల్లగొండలో ప్రశాంతంగా పోలీస్ అసోసియేషన్ ఎన్నికలు

కలం, నల్లగొండ: నల్లగొండ (Nalgonda) జిల్లావ్యాప్తంగా పోలీస్ అధికారుల, సిబ్బంది సంక్షేమం లక్ష్యంగా నిర్వహించే ‘పోలీస్ అసోసియేషన్’ ఎన్నికల (Police Association Elections) ప్రక్రియ అత్యంత ఉత్సాహభరితమైన వాతావరణంలో ప్రారంభమైంది. దాదాపు 14 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఈ ఎన్నికలు జరుగుతుండటంతో జిల్లాలోని పోలీస్ యంత్రాంగంలో తీవ్ర ఆసక్తి, సందడి నెలకొంది.

జిల్లావ్యాప్తంగా ఉన్న పలు సర్కిల్ కార్యాలయాల్లో ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఓటింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ భావనకు అద్దం పడుతూ, ఎంతో సామరస్యపూర్వకంగా, స్నేహపూర్వక వాతావరణంలో సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సుదీర్ఘ కాలం తర్వాత జరుగుతున్న ప్రక్రియ కావడంతో సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొంటున్నారు.

పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఫలితాలను వెల్లడించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఎన్నికల ద్వారా తమ సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి కృషి చేసే సరైన నాయకత్వాన్ని ఎన్నుకునేందుకు పోలీస్ సిబ్బంది ఆసక్తి చూపుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>