జర్నలిజం ముసుగులో అక్రమ వసూళ్లు.. రిపోర్టర్లు అరెస్ట్!

కలం, ​అశ్వారావుపేట: జర్నలిజం ముసుగులో కొందరు రైతును బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. దీంతో ‘టీ మీడియా’ రిపోర్టర్‌తో సహా ఇద్దరిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట (Aswaraopeta) పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ​రామచంద్రాపురం ఎక్స్‌రోడ్డు సమీపంలో పొగాకు లోడుతో ఓ ట్రాక్టర్ వెళ్తోంది. అదే సమయంలో దమ్మపేటకు చెందిన వెండె కిరణ్, సయ్యద్ జాన్ అజాద్‌లు తాము మీడియా ప్రతినిధులమని రైతును బెదిరించారు. డబ్బులు ఇవ్వకపోతే మీడియాలో వార్తలు రాస్తామని బెదిరించారు. బాధితుడి వద్ద ఉన్న రూ.5 వేలను బలవంతంగా లాక్కున్నారు.

​బాధితుడి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన సీఐ నాగరాజు, ఎస్ఐ యయాతి రాజు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1,000 నగదు, ప్రెస్ ఐడీ కార్డు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై BNS సెక్షన్ 309(4) కింద కేసు నమోదు చేశారు. మీడియా పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>