మంత్రి వాకిటి శ్రీహరికి రాఖీ కట్టిన సీతక్క

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) నివాసంలో శుక్రవారం రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి సీతక్క వాకిటి శ్రీహరికి రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.

సీతక్కతో పాటు ఇందిరా శోభన్, సంధ్యారెడ్డి కూడా మంత్రి వాకిటి శ్రీహరికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి, ఆత్మీయతకు ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి రాఖీ కట్టిన సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>