రాఖీ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఏలేటి

కలం, నిర్మల్: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళా మోర్చా నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మిఠాయిలు తినిపించి ఆత్మీయతను చాటుకున్నారు. రాఖీ పండుగ సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, ఆత్మీయతకు ప్రతీకగా నిలుస్తుందని ఏలేటి అన్నారు. మహిళా మోర్చా నాయకులు చూపిన అభిమానానికి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>