మహబూబ్‌నగర్ రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో రాఖీ వేడుకలు.. పాల్గొన్న డీఎస్పీ

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : ఆత్మీయ అనుబంధాలకు ప్రతీక రక్షాబంధన్ పండుగని మహబూబ్ నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు (Mahabubnagar DSP Venkateshwarlu) అన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ లోని రెడ్ క్రాస్ సన్నిధి ఆశ్రమంలో అత్యంత వైభవంగా కనుల పండువగా రక్షాబంధన్ ను నిర్వహించారు. రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ డాక్టర్ అంబటి నటరాజ్ అధ్యక్షతన జరిగిన వేడుకకు మహబూబ్ నగర్ డీఎస్పీ ఎం.వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్బంగా వారు సన్నిధి విద్యార్థులతో కలిసి పరస్పరం రాఖీలు కట్టుకొని మిఠాయిలు తినిపించుకున్నారు. అనంతరం డీఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి రక్షా బంధన్ ప్రతీకగా నిలిస్తోందన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను బావి తరాలకు అందించేందుకు రాఖీ వేడుకలు ఎంతగానో దోహదం చేస్తాయని అన్నారు. విద్యార్థులు ఆయురారోగ్యాలు, ఆనందం, విజయాలతో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.

రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్ మాట్లాడుతూ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యకమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ రెడ్ క్రాస్ కో ఆర్డినేటర్ బాబుల్ రెడ్డి, జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయ కర్త లయన్ అశ్విని చంద్రశేఖర్, మల్లి కార్జున్, వెంకటేశ్వరమ్మ సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>