కలం, వెబ్ డెస్క్ : విశాఖపట్నం మర్రిపాలెం రైల్వే కోచ్ యార్డ్ (Marripalem Railway Coach Yard) లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో రైల్వో కోచ్ యార్డ్ లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. భోగీలను డిస్మెటల్ పనులు చేస్తున్న సందర్భంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో పలు రైల్వే కోచులు దగ్ధమయ్యాయి. కాగా, సంఘటకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

