కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు (Harish Rao) ఇంట రాఖీ పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. సోదర, సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా హరీశ్ రావుకు మహిళా ప్రజా ప్రతినిధులు, శ్రేయోభిలాషులు, అభిమానులు కలిసి రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్ రావు వారితో ఆత్మీయంగా ముచ్చటించారు. తనను కలిసి రాఖీలు కట్టి ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధాలకు రక్షాబంధన్ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ప్రజా ప్రతినిధులు, శ్రేయోభిలాషులు, అభిమానులు తనపై చూపిన ఆప్యాయత పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.

