‘భోగి’లో ఫ్యామిలీ ఎమోషన్స్.. రాఖీకి అదిరిపోయే ట్రీట్!

కలం, సినిమా : చార్మింగ్ స్టార్ శర్వానంద్ (Sharwanand) హీరోగా దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘భోగి’(Bhogi). ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా.. రాఖీ పండుగ సందర్భంగా మేకర్స్ మరో ఆసక్తికరమైన అప్డేట్‌ను పంచుకున్నారు. దర్శకుడు సంపత్ నంది తాజాగా సోషల్ మీడియాలో ‘భోగి’కి సంబంధించిన ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. “సోల్ ఆఫ్ అవర్ గంగ.. సోల్ ఆఫ్ భోగి.. ఫైవ్ సిస్టర్స్.. వన్ వరల్డ్.. వన్ హార్ట్‌బీట్” అంటూ ఆయన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

‘భోగి’ సినిమాలో ఐదుగురు అక్కాచెల్లెళ్ల అనుబంధం కథలో ప్రధాన భాగంగా ఉండనున్నట్లు ఈ పోస్టర్ ద్వారా తెలుస్తోంది. రాఖీ పండుగ సందర్భంగా ఈ కాన్సెప్ట్‌ను పరిచయం చేయడంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఈ ఐదుగురు సోదరీమణుల జీవితాల్లోకి శర్వానంద్ పాత్ర ఎలా వస్తుంది? వారి కథ ఎలాంటి మలుపులు తిరుగుతుంది? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి  కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కే.కే. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అప్డేట్‌ను మేకర్స్ ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తుండటంతో శర్వానంద్ అభిమానులలో ‘భోగి’ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>