కలం, వెబ్ డెస్క్ : కోదాడ పట్టణ సీఐ (Kodad CI) ఓ సాధారణ వ్యక్తిపై దాడి చేశారంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్గా మారింది. కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ (Bollam Mallaiah Yadav) తన సోషల్ మీడియా ఖాతాలో ఈ వీడియోను షేర్ చేస్తూ పోలీసుల తీరుపై ప్రశ్నలు లేవనెత్తారు. వీడియోలో కోదాడ టౌన్ సీఐగా పేర్కొంటున్న అధికారి ఓ వ్యక్తి కాలర్ పట్టుకుని లాగుతూ, రోడ్డుపై పడేసి అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
“ఇది చట్టం అమలేనా.. లేక రోడ్డుపై గూండాయిజమా?” అంటూ మల్లయ్య యాదవ్ ప్రశ్నించారు. ప్రజలను రక్షించాల్సిన పోలీసు అధికారి సాధారణ పౌరుడిపై ఇలా వ్యవహరించడం అధికార దుర్వినియోగానికి నిదర్శనమని విమర్శించారు. పోలీసు యూనిఫాం ఇచ్చింది ప్రజలను భయపెట్టేందుకు కాదు.. రక్షించేందుకు అని పేర్కొన్నారు. ఈ ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, సీఐను సస్పెండ్ చేసి సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

