మంత్రి లోకేశ్ రాఖీ క‌ట్టిన ఎమ్మెల్యే మాధ‌వి!

క‌లం, వెబ్‌డెస్క్: రాఖీ పౌర్ణమి వేడుకలను పురస్కరించుకుని ఉండవల్లిలోని నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తదితరులు విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ (Nara Lokesh)కు రాఖీ కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ వేడుకల సందర్భంగా మంత్రి లోకేష్ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, తెలుగింటి ఆడపడుచులందరికీ హృదయపూర్వక రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే ఈ పవిత్ర పండుగ రోజున ప్రజాప్రతినిధులు నివాసంలో కలుసుకుని పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకోవ‌డం ప‌ట్ల‌ పలువురు హర్షం వ్యక్తం చేశారు. మహిళల రక్షణ, సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ వేడుకలు మరోసారి గుర్తు చేశాయని టీడీపీ నాయ‌కులు పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>