కలం, కరీంనగర్ : తిమ్మాపూర్ (Thimmapur) మండలం లోని నేదునూర్ జడ్పి పాఠశాలలో గురువారం రక్షా బంధన్ ముందస్తు వేడుకలను నిర్వహించినట్లు హెచ్ఎం లక్ష్మణ్ రావు తెలిపారు. విద్యార్థి-విద్యార్థునుల్లో ఒకరికొకరు రక్ష అనే భావాన్ని విస్తృత పర్చాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం నిర్వహిం చినట్లు తెలిపారు. మొక్కలను కూడా సంరక్షించే బాధ్యతకూడా పెరిగేలా మొక్కలకు కూడా రాఖీలను కట్టించినట్లు, రాఖీ లను సమకూర్చిన బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు బూట్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. ఉపాధ్యాయ బృందం, సిబ్బంది, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

