కలం, మహబూబ్ నగర్ బ్యూరో : అన్నా చెల్లి, అక్కా తమ్ముడి అనుబంధానికి ప్రతీకైన రక్షా బంధన్ వేడుకలు దేవరకద్ర మండలం లక్ష్మీ పల్లి ప్రాథమిక పాఠశాలలో గురువారం అట్ట హాసంగా ఘనంగా నిర్వహించారు. ‘నేను నీకు రక్ష … నువ్వు నాకు రక్ష, మనందరం మన దేశానికి, ధర్మానికి రక్ష’ అంటూ విద్యార్థులు ఒకరికొకరు రాఖీలు కట్టుకున్నారు. ఈ సందర్భంగా పరస్పరం మిఠాయిలు తినిపించుకొని రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం ఎస్.కల్పన అధ్యక్షతన వేడుకలో ఉపాధ్యాయులు లయన్ అశ్విని చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులకు భారతీయ సాంస్కృతి సంప్రదాయాలను, రక్షా బంధన్ ప్రాముఖ్యతను వివరించారు. సోదరుల, సోదరీమణుల ప్రేమ, ఆప్యాయతలకు రక్షా బంధన్ వేడుకలు ఒక ప్రతీకగా నిలుస్తాయన్నారు. విద్యార్థులు ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా రాఖీ పర్వదిన వేడుకలు నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం ఎస్.కల్పన, ఉపాధ్యాయులు అశ్విని చంద్ర శేఖర్, టి.నాగేశ్వర్ రెడ్డి, విద్యా వాలింటర్ వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.

