ఆడియెన్స్‌కు సినిమా న‌చ్చ‌క‌పోతే గుండు చేసుకుంటానంటున్న హీరోయిన్​!

క‌లం, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో చిన్న‌ సినిమాలు, కొత్త న‌టీన‌టుల సొంద‌డి మొద‌లైంది. కొంచెం పాజిటివ్ టాక్ వ‌చ్చినా చిన్న సినిమాల‌కు సైతం ఆడియెన్స్ బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. క‌మిటీ కుర్రోళ్లు, రాజు వెడ్స్ రాంబాయి, ఎనిమిది వ‌సంతాలు వంటి సినిమాలు ఇలా స‌క్సెస్ కొట్టిన‌వే. ఇక త‌మ సినిమాల ప్ర‌మోష‌న్ల కోసం కూడా కొత్త న‌టీన‌టులు చాలా క‌ష్ట‌ప‌డుతున్నారు. సోష‌ల్ మీడియాను కూడా దీని కోసం విరివిగా వాడేస్తున్నారు. ఇలా తాజాగా త‌న సినిమా ప్ర‌చారంలో భాగంగా స‌హ లైఫ్ ఆఫ్ సంజు (Sahaa Life Of Sanju) మూవీ హీరోయిన్ శ్వేత ల‌క్ష్మ‌ణ్‌ (Swetha Lakshman) చేసిన కామెంట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

నిషాంత్ దోటి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న సినిమా స‌హ‌. ఈ మూవీ సెప్టెంబ‌ర్ 4న విడుద‌ల కానుంది. కంప్లీట్ ల‌వ్ అండ్ ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వ‌స్తున్న ఈ సినిమాలో శ్వేత ల‌క్ష్మ‌ణ్‌, శివ‌కుమార్ కాసారం జంట‌గా న‌టిస్తున్నారు. నేడు ఈ సినిమా ట్రైల‌ర్ లాంచ్ చేశారు. ఈ సంద‌ర్భంగా హీరో హీరోయిన్లు చేసిన కామెంట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఈ వేడుక‌లో హీరోయిన్ శ్వ‌త‌ మాట్లాడుతూ.. త‌న సినిమా ఆడియెన్స్‌కు న‌చ్చ‌క‌పోతే అమీర్‌పేట్ సెంట‌ర్‌లో గుండు చేసుకుంటాన‌న్నారు. ప్ర‌తి వ్య‌క్తి జీవితంలో ఎన్నో ఎమోష‌న్స్ ఉంటాయ‌ని , అలాంటి అన్ని ఎమోష‌న్స్‌ను చాలా అందంగా సినిమాలో చూపించామ‌న్నారు. మ‌నం తీసుకునే ఒక్క నిర్ణ‌యం కూడా మ‌న జీవితంపై ఎంతో ప్ర‌భావాన్ని చూపుతుంద‌ని చెప్పారు. సినిమా చూసిన త‌ర్వాత ఆడియెన్స్ అంద‌రూ ఎంత మంచి సినిమా తీశారు అని త‌ప్ప‌కుండా అనుకుంటార‌న్నారు. థియేట‌ర్స్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు ఆడియెన్స్ ఎవ్వ‌రూ డిస‌ప్పాయింట్ అవ్వ‌ర‌ని చెప్పారు. ఎవ‌రైనా సినిమా చూసి డిస‌ప్పాయింట్ అయితే తాను అమీర్‌పేట్ సెంట‌ర్‌లో గుండు కొట్టించుకుంటాన‌ని శ్వేత ఛాలెంజ్ చేశారు. త‌న సినిమా చూడాల‌ని రిక్వెస్ట్ చేయ‌డం లేద‌ని, అంద‌రికీ తాను చాలెంజ్ చేస్తున్నాన‌ని శ్వేత అన్నారు. చాలా పెద్ద హిట్ కొట్ట‌బోతున్నామ‌ని, ప్ర‌తి ఒక్క‌రూ థియేట‌ర్స్‌కు వ‌చ్చి చూడాల‌ని కోరారు.

అలాగే హీరో శివ‌కుమార్ మాట్లాడుతూ.. త‌మ సినిమాను అంద‌రూ చూసి ఆద‌రించాల‌ని కోరారు. స‌హ మూవీ న‌చ్చ‌క‌పోతే త‌న నెంబ‌ర్‌కు ఫోన్ చేసి బూతులు తిట్టండి అంటూ స్టేజీ పైనే ఫోన్ నెంబ‌ర్ కూడా చెప్పేశాడు. ఇక ఈ మూవీ టీమ్ కాన్ఫిడెన్స్ చూసి నెటిజ‌న్లు షాక‌వుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>