నగునూరు గ్రామ సమస్యలపై గంగుల ఫోకస్.. నిధులు మంజూరు చేస్తానని హామీ!

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) నియోజకవర్గంలోని కరీంనగర్ రూరల్ మండలం నగునూరు (Nagunur) గ్రామంలో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. ఎస్‌జీఎఫ్ (SGF) నిధులు రూ. 10 లక్షలతో గ్రామంలో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (MLA Gangula Kamalakar) బుధవారం ఘనంగా శంకుస్థాపన చేశారు. కరీంనగర్ ఫ్యాక్స్ చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ సాయిల్ల శ్రావణి మహేందర్‌లతో కలిసి ఆయన ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఘన స్వాగతం.. సమస్యల ఆరా

​గ్రామానికి విచ్చేసిన మాజీ మంత్రి గంగుల కమలాకర్‌కు గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు అందించి, ఘనంగా శాలువాలతో సత్కరించారు. అనంతరం పాలకవర్గ సభ్యులు, గ్రామస్థులతో సమావేశమైన ఎమ్మెల్యే.. గ్రామంలో నెలకొన్న సమస్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాగునీటితో పాటు కరెంట్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని, పలు వీధుల్లో సీసీ రోడ్లు నిర్మించాలని ప్రజలు ఆయనను కోరారు. స్పందించిన ఎమ్మెల్యే.. తన నిధుల నుంచి నిధులు మంజూరు చేసి సమస్యలన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామని వారికి భరోసా ఇచ్చారు.

​మల్లికార్జున స్వామి ఆలయ భూమిపూజ

​ప్రజలతో కలిసి గ్రామంలో ర్యాలీగా వెళ్లిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్.. నూతనంగా నిర్మిస్తున్న మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణానికి ప్రత్యేక పూజలు నిర్వహించి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా దైవ కార్యానికి తన వంతు సహాయంగా రూ. 1 లక్ష విరాళాన్ని ప్రకటించారు. గ్రామ వీధుల గుండా వెళ్తున్న సమయంలో ప్రజలు పూలు చల్లుతూ, శాలువాలు కప్పి తమ ఆప్యాయతను చాటుకున్నారు.

​ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రాష్ట్రం పదేళ్లపాటు అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోయిందని, అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లారని గుర్తుచేశారు. కానీ, నేడు రేవంత్ ప్రభుత్వం అలవిగాని అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి, ప్రజల క్షేమాన్ని పూర్తిగా మరిచిపోయిందని దుయ్యబట్టారు.

​”కేసీఆర్ హయాంలో ఇస్తున్న సంక్షేమ పథకాలతో పాటు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ కింద తులం బంగారం ఇస్తామని ఆశ చూపి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. ప్రజలను మోసం చేసిన ఏ ప్రభుత్వమైనా గద్దె దిగక తప్పదు. రానున్న రెండేళ్లలో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయం అనీ కేసీఆర్ నేతృత్వంలో ప్రజలకు మళ్లీ సుపరిపాలన అందిస్తాం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో పాటు కరీంనగర్ ఫ్యాక్స్ చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, నగునూరు సర్పంచ్ సాఇల్ల శ్రావణి మహేందర్, ఉప సర్పంచ్ హనుమంత రావు, నాయకులు పాషా, రవితేజ, దిలీప్, భద్రయ్య, శ్రీనివాస్, సుదర్శన్‌రెడ్డి, రంగారెడ్డి, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>